వారం రోజుల్లో ఉప ఎన్నికలు వస్తున్నాయన్న ప్రచారం వట్టిదేనని CM రేవంత్ అన్నారు. 2029 వరకు ఎలాంటి ఎన్నికలు రాకపోవచ్చన్నారు. 2014లో ఎలాంటి సంప్రదాయాలు పాటించారో తామూ అలాగే చేస్తున్నామంటూ విపక్ష BRSకు చురకలంటించారు. ‘శాసనసభ విధానాలు మారలే.. రాజ్యాంగం మారలే.. అన్నీ అలాగే ఉన్నప్పుడు వారంలో ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్షా.. ఆనాడు మారిన MLAల్ని మంత్రులు చేశారు.. మంత్రులు డిస్ క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు.. బాజాప్తా గవర్నర్ దగ్గరకు పోయి మంత్రులుగా చేసి ఐదేళ్లు, ఎనిమిదిన్నరేళ్లు, మా అక్క నాలుగున్నరేళ్లు పనిచేశారు..’ అంటూ విపక్షం గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. ఫిరాయింపులపై సుప్రీంలో కేసు నడుస్తున్న దృష్ట్యా ఇక ఎన్నికలు వస్తాయంటూ రాష్ట్రంలో ప్రచారం సాగుతోంది.