‘నేను కొందరికి నచ్చకపోవచ్చు.. కొందరు నన్ను అంగీకరించపోవచ్చు.. కానీ నా పని నేను చేస్తున్నా.. ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను..’ అంటూ CM రేవంత్ ఢిల్లీ పర్యటనలో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ తరఫున ప్రజలకు హామీ ఇచ్చింది తానే కాబట్టి.. ఏదైనా అమలు చేయకపోతే గట్టిగా అడుగుతారని గుర్తు చేశారు. తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, కేబినెట్ విస్తరణ తనొక్కడి నిర్ణయమే కాదన్నారు. PCC కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు(Speculations) వ్యాప్తి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని రేవంత్ అన్నారు. ప్రధానిని కించపరిచేలా మాట్లాడలేదన్న ఆయన.. మోదీ BC కాదు అన్న విషయాన్ని గుర్తు చేశానన్నారు.