ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు రుణమాఫీ(Loan Waive)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట మేరకు త్వరలోనే రుణమాఫీ అమలు చేస్తామంటూ తేదీ కూడా ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలు ముగియగానే ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు.
4 నెలల్లో…
ఆగస్టు 15 నాటికి మాఫీ చేయనున్న 2 లక్షల రుణాన్ని ఏకకాలంలో అమలు చేస్తామని CM స్పష్టతనిచ్చారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గబోమని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే రెండు నెలల్లోపు స్థానిక సంస్థల(Local Bodies) ఎలక్షన్లు ఉంటాయని ఆ తర్వాత రైతు రుణమాఫీని అమలు చేయనున్నట్లు మాట ఇచ్చారు.