అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజు ప్రారంభం నుంచే చర్చ వాడీవేడిగా సాగింది. తొలుత గంగుల(Gangula) కమలాకర్, మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) మధ్య మాటలయుద్ధం నడిచింది. కేసీఆర్ ఇంటిపేరు కల్వకుంట్ల కాదని, కల్వకుండా చేసే కుటుంబమని రేవంత్ అన్నారు. ‘ఇప్పటికైనా మిత్రులు గంగుల కమలాకర్ కు నా సూచన.. వాళ్ల పోకడలు ఎట్లుంటయో మీక తెల్వదా.. నేను చెప్పాల్నా.. వాళ్ల ఒత్తిడికి లొంగకు.. ఏదన్నా మంచిచెడ్డ ఉంటే నేను చూస్కుంటా.. మనం పాత మిత్రులమే కదా.. నీకు తెల్వంది ఏముంది.. అధ్యక్షా అది కల్వకుంట్ల కాదు కల్వకుండా ఉంచడం అన్నమాట..’ అని కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేశారు.