
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో అప్పగిస్తే.. 2023 నాటికి రూ.8 లక్షల కోట్ల అప్పును KCR చేశారని CM రేవంత్ విమర్శించారు. కుమారుడి వాస్తు బాగాలేదని ఏకంగా సచివాలయాన్ని కూలగొట్టిన వ్యక్తి అని ఆరోపణలు చేశారు. తనలా నకిలీ మనుషుల్ని తయారు చేసుకున్న సద్దాం హుస్సేన్ మాదిరిగా ప్రాణభయంతో KCR అలాగే తయారయ్యారని విమర్శలు చేశారు. KTR, కిషన్ రెడ్డిని బ్యాడ్ బ్రదర్స్ గా సంబోధించిన రేవంత్.. కొవిడ్ కాలంలో వచ్చిన విరాళాల్ని దోచుకున్న వ్యక్తులు KCR, KTR అన్నారు.