దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉండి అది కోల్పోయే సరికి KCRకు ఏమీ అర్థం కావడం లేదని, ఆయన కాలం చెల్లిన మందు(Medicine) లాంటి వారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అవినీతి బయటపడుతున్న సమయంలో KRMB విషయాన్ని తెరపైకి తెస్తూ దృష్టి మళ్లించాలని చూస్తున్నారని విమర్శించారు. బడ్జెట్ సమావేశాల(Budget Sessions) సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి హాజరు కాకపోవడాన్ని బట్టే ప్రజాస్వామ్యంపై ఈ మాజీ ముఖ్యమంత్రికి ఏ పాటి గౌరవముందో అర్థమవుతుందన్నారు.
హిమాన్షు కూడా వస్తానంటే ఎలా…
‘BAC సమావేశానికి డుమ్మా కొట్టిన చంద్రశేఖర్ రావు… హరీశ్ రావు, కడియం శ్రీహరి ఆ మీటింగ్ వస్తారంటూ పేర్లు ఇచ్చారు… ఆయన స్థానంలో హరీశ్ ను ఎట్లా అనుమతిస్తాం(Permission)… రేపు KTR తనయుడు హిమాన్షు కూడా వస్తానంటే స్వాగతం చెప్పాలా… శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన హరీశ్ కు ఈ విషయం తెలియదా’ అని CM మండిపడ్డారు.
Published 09 Feb 2024