కాళేశ్వరం పేరుతో KCR.. డ్రగ్స్, విదేశీ మద్యంతో ఒకరు, ఫామ్ హౌజ్ తో ఇంకొకరు చేసిన బాగోతంపై లెక్క తీస్తానంటూ CM రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. KTR ఇంట్లో విదేశీ మద్యం దొరికినా, అక్రమంగా ఫాంహౌజ్ కట్టుకున్నా కేసు పెట్టొద్దంటూ హరీశ్ రావు చెప్పడం వాళ్ల నీతికి నిదర్శనమని మండిపడ్డారు. వెయ్యి, 1200 ఎకరాల కోసం భూసేకరణ చేస్తే రౌడీమూకలతో కలెక్టర్, ఇతర అధికారుల్ని కొట్టారని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా.. భూసేకరణ చేయొద్దా.. కొడుకు, అల్లుణ్ని సమర్థిస్తున్నారా KCR అంటూ రేవంత్ విమర్శించారు.