నేపాల్ లో పదవులు ఇవ్వలేదని రాజకుటుంబం మొత్తాన్ని యువరాజు కాల్చి చంపిన ఘటనను వివరిస్తూ CM రేవంత్ కౌంటర్ వేశారు. ఏమన్నారంటే…
‘ఈ ఐదేళ్లు కాదు.. వచ్చే ఐదేండ్లు కూడా మేమే ఉంటం.. పెద్దాయన మీకు కుర్చీ ఇయ్యరు.. కాస్త ఉండనీయండి పెద్దమనిషిని తెలంగాణలో.. ఆయన కుర్చీమీద కన్నేస్తరేంది మీరిద్దరు కలిసి.. ఎందుకు ఆయన మీద పగబట్టిండ్రు… కుటుంబంలో పెద్ద దిక్కు ఒకాయనుండాలె.. పెద్దదిక్కుంటేనే గౌరవముంటది.. గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK47 పెట్టి కాల్చేసిండట.. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుంట చూడండి అధ్యక్షా.. అని విపక్ష పార్టీకి కౌంటర్ ఇచ్చారు.