ఖమ్మంలో వచ్చిన వరదలకు ఎక్కడికక్కడి ఆక్రమణలే(Encroachments) కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆక్రమించిన ప్రాంతాల్లో నిర్మాణాల వల్లే విపత్తు వచ్చిందని, మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచాల్సిన అవసరముందని మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడారు. 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ ఇలాంటి వానలు పడలేదని, 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
సర్వే ఆఫ్ ఇండియా ద్వారా మ్యాప్స్ తీసుకుని ఆక్రమణలు తొలగిస్తామన్న CM.. BRS నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమణలు చేశారని ఆరోపించారు. ఆక్రమించిన స్థలంలోనే హాస్పిటల్ ను పువ్వాడ కట్టించారని, హరీశ్ రావుకు చేతనైతే పువ్వాడకు చెప్పి వాటిని తొలగించాలని సవాల్ చేశారు.