ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మొత్తుకునే BRS నేతలు.. తమ పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాకు ఎందుకు అన్యాయం చేశారని CM రేవంత్ విమర్శించారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పాపాలు చేసిన వ్యక్తి KCR అని మండిపడ్డారు. 70 ఏళ్ల తర్వాత మహబూబ్ననగర్ జిల్లాకు చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని, ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా అభివృద్ధి చేసుకుంటామన్నారు. పాలమూరు జిల్లా వాళ్లకు పరిపాలన చేతకాదా, 20 లక్షల కోట్లున్నా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి మనసు రాలేదని BRS పాలనపై విమర్శలు చేశారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత 70 ఏళ్లకు ఈ జిల్లాకు వచ్చిన అవకాశమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు తెలియజేశారు.