ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(PCC)కి కొత్త అధ్యక్షుడు(President) రావాల్సిన అవసరముందని CM రేవంత్ రెడ్డి అన్నారు. తన హయాంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని గుర్తు చేశారు.
2021 జూన్ 27న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియమితులైతే జులై 7న బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ నిబంధనల ప్రకారం మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యాక కొత్త అధ్యక్షుడు రావాలని, తనకు నాలుగేళ్ల పదవీకాలం పూర్తయినందున కొత్త అధ్యక్షుణ్ని నియమించాలని తన ఢిల్లీ పర్యటనలలో AICC పెద్దల్ని కోరినట్లు రేవంత్ చెప్పారు.