అన్నింటికీ బ్రహ్మ పదార్థంలా తయారైన రేషన్ కార్డు విషయంలో ముఖ్యమంత్రి మరోసారి కీలక సూచనలు(Instructions) చేశారు. ఆరోగ్యశ్రీని రేషన్ కార్డుతో ముడిపెట్టొద్దని కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య(Health) కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
డిజిటల్ ప్రొఫైల్…
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్(Health Profile) ఉండాలన్న CM.. హాస్పిటళ్ల మెయింటెనెన్స్ కు ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలన్నారు. సర్కారీ దవాఖానాల్లో ప్రతి బెడ్ కు ఒక సీరియల్ నంబరుతోపాటు రూరల్ ఏరియాల్లో పనిచేసే డాక్టర్లకు ఎక్కువ పారితోషికం(Salary) ఇచ్చి ప్రోత్సహించాలన్నారు.
RMP, PMPలకు ట్రెయినింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందని, దానిపై అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారుల్ని రేవంత్ ఆదేశించారు.