‘ఎవరితోనైనా చెలగాటమాడొచ్చు గానీ టీచర్లతో ఆడితే ఏం చేస్తారో తెలుసా.. ఈ విషయం రాజకీయ నాయకుల(Leaders)కు బాగా తెలుసు.. వాళ్లు ఏమీ అనరు.. పోలింగ్ బూతుల్లో ఏం చేయాలో అది చేస్తారు..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే టీచర్ల ప్రమోషన్ల విషయంలో గానీ బదిలీల అంశంపైనా గత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోకపోవడం వల్లే వేలాది మంది ఉపాధ్యాయుల్లో అపనమ్మకం, అసంతృప్తి పేరుకుపోయాయన్నారు.
సంపూర్ణంగా ప్రక్షాళన చేసి పునర్నిర్మించేందుకే విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని CM తెలిపారు. బదిలీలు(Transfers), ప్రమోషన్ల విషయంలో ఎలాంటి అపవాదులు రాకుండా రివ్యూలు చేయడం వల్లే వివాదరహితంగా పూర్తి చేయగలిగామన్నారు. అటెండర్లు, టాయిలెట్లతోపాటు ఎలాంటి సౌకర్యాలు లేని 5 వేల పాఠశాలల్ని KCR ప్రభుత్వం మూసివేసిందని విమర్శించారు.
Issue 5DA’s immediately