త్వరలోనే స్థానిక సంస్థలు(Local Bodies) ఎన్నికలు నిర్వహిస్తామని, అందులో సర్పంచులు, MPTC టికెట్లు కష్టపడ్డవారికే ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తల్ని గుర్తించామని మహబూబ్ నగర్ టూర్లో తెలిపారు.
కాంగ్రెస్ పని అయిపోందన్న స్థితి నుంచి అధికారంలోకి రావడం కిందిస్థాయిలో ఉన్నవారి కృషి ఫలితమేనన్నారు. MLAలు, MLCలు పార్టీ మారుతున్నారంటూ KCR గగ్గోలు పెడుతున్నారని.. గత పదేళ్లలో ఎంతమందిని లాక్కోలేదని గుర్తు చేశారు.
BRS భూమ్మీదే కనపడదని, కాంగ్రెస్ ఉసురు తగిలి KCRకు ఇక రాజకీయ భవిష్యత్తే ఉండదని విమర్శించారు. నెల రోజుల్లోనే సర్కారు కూలిపోతుందన్న కేసీఆర్ కు తనదాకా వస్తే తప్ప బాధ తెలియలేదన్నారు.