KCR కాలం చెల్లిన(Expiry) ఔషధం(Medicine) వంటి వ్యక్తి అని, ఆయన శకం ముగిసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తనయుడు KTRతోనే కేసీఆర్ రాజకీయం క్లోజ్ అవుతుందని మీడియాతో చిట్ చాట్ లో విమర్శించారు. ‘KTRతో కేసీఆర్ రాజకీయం ముగుస్తుంది.. అటు బావతో బామ్మర్ది రాజకీయం ఖతం.. ఆ బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు..’ అంటూ రేవంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాళేశ్వరం అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ పై న్యాయ విచారణలు జరుగుతున్నాయని, చట్టప్రకారం కచ్చితంగా చర్యలుంటాయని CM గుర్తు చేశారు.