చెరువుల్ని చెరబట్టి విలాసాల కోసం ఫాంహౌజ్ లు నిర్మించుకుంటున్నారని, వాటి నుంచి వ్యర్థాల్ని వదులుతూ గండిపేట, హిమాయత్ సాగర్లను కలుషితం చేస్తున్నారని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా చెరువుల ఆక్రమణదారులపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. చెరువుల్ని అలాగే వదిలేస్తే మేం ప్రజాప్రతినిధులుగా ఉండి వ్యర్థమేనంటూ హైదరాబాద్ లో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడారు.
‘ఇది రాజకీయాలో లేదంటే కక్షల కోసమో చేస్తున్న కార్యక్రమం కాదు.. భవిష్యత్తు తరాలు(Generations) బాగుండాలనే సంకల్పంతో మొదలుపెటింది.. కోట్లాది మంది దాహార్తి తీర్చే చెరువుల పరిధిలో ఇష్టమొచ్చినట్లు నిర్మాణాలు చేస్తే ఊరుకోబోం..’ అని క్లారిటీ ఇచ్చారు.