భారీ వర్షాలతో అస్తవ్యస్థమైన కామారెడ్డి(Kamareddy) పట్టణాన్ని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. వరదలతో పడ్డ అవస్థల గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. లింగంపేట మండలం బుడిగిద్దలో కొట్టుకుపోయిన పొలాల్ని పరిశీలించారు. కామారెడ్డిలో దెబ్బతిన్న రోడ్లు, కాలనీల వివరాలు అడిగారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క CM వెంట ఉన్నారు.