హస్తం పార్టీ అభ్యర్థులు గెలిచినా తనదే అధికారమని నమ్మి ఆ పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రే డబ్బులు అందజేస్తున్నారని BJP MP, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. అలా రాష్ట్రవ్యాప్తంగా 50 నుంచి 70 మందికి డబ్బులు అందుతున్నాయని విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బొమ్మ శ్రీరామ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనయుడు KTR ముఖ్యమంత్రి అయితే పార్టీలో గొడవలు తప్పవని, అందుకే నియోజకవర్గానికి CM అభ్యర్థి ఉన్న కాంగ్రెస్ అయితేనే బెటర్ అన్న ఉద్దేశంతో కేసీఆర్ ఆలోచన ఉందని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గతి లేదని, ఆ పార్టీకి ఓటేస్తే అది వెళ్లేది BRSకేనన్న సంజయ్.. పేదల కోసం కొట్లాడే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని కోరారు.
మూడేళ్ల ముచ్చటే కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి మూడేళ్ల ముచ్చటగా మారిందని మరో సీనియర్ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టుకు మెదడంతా కరగబెట్టానంటూ ప్రజల్ని మాయ చేశారని ఈటల విమర్శించారు. మొన్నటి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చిన ధైర్యమే గజ్వేల్ లో పోటీ చేసే స్థాయికి తీసుకెళ్లిందని గుర్తుచేశారు.