కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే నిలువునా అమ్మేస్తారని ముఖ్యమంత్రి(Chief Minister) కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆచితూచి ఓటేయకపోతే కష్టాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా దమ్మపేట, బూర్గంపాడుతోపాటు నర్సంపేటలో నిర్వహించిన BRS ఆశీర్వాద సభల్లో KCR పాల్గొన్నారు. పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులను చూసి తమకు ఓటేయాలని అడుగుతున్నామని, BRS పుట్టిందే రాష్ట్ర ప్రజల మేలు కోసమని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చామన్న కేసీఆర్.. రాష్ట్రంలో ఇప్పుడు 24 గంటల కంటిన్యూ విద్యుత్తు ఇస్తున్నామన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలవాలి
ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలవాల్సిన అవసరం ఉందన్న KCR.. ఓటు వేసేముందు అభ్యర్థుల గుణగణాలతోపాటు పార్టీల చరిత్రను తెలుసుకోవాలన్నారు. రైతుల సంక్షేమం కోసమే ధరణి పోర్టల్ తెచ్చామని, MROల నుంచి బాధలు తప్పించేందుకే దీన్ని అందరికీ దగ్గర చేశామన్నారు. అలాంటి ధరణి పథకాన్ని బంగాళాఖాతంలో వేస్తామనడం కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు.