
ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా వ్యవహరిస్తూ మంత్రి కేటీ రామారావు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆయనపై కంప్లయింట్ నమోదైంది. కేంద్ర ఎన్నికల సంఘాని(Central Election Commission)కి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. డబ్బులు తీసుకుని ఓటు వేయండి అంటూ మంత్రి ప్రలోభాలకు గురిచేస్తున్నారని అందులో తెలిపింది. CEC అధికారులను కలిసిన కాంగ్రెస్ నేత వేణుగోపాలస్వామి.. మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
గత కొద్దిరోజులుగా కేటీఆర్ విస్తృతంగా సభల్లో పాల్గొంటున్నారు. అన్ని జిల్లాలు చుటి వస్తూ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతున్నారు. డబ్బులు ఇస్తే వద్దనకండి.. అవి తీసుకునేవాళ్ల దగ్గర తీసుకోండి.. కానీ ఓటు మాత్రం BRSకే వేయాలి అంటూ సభల్లో తరచూ ప్రస్తావిస్తున్నారు. దీనిపై మండిపడ్డ హస్తం పార్టీ నేతలు.. మంత్రి వ్యవహారశైలిపై ఈసీని ఆశ్రయించడమే మేలని భావించారు. అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని కలిసి ఫిర్యాదు చేశారు.