కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాల్ని(Accounts) నరేంద్ర మోదీ ప్రభుత్వం స్తంభింపజేసిందని(Freezing) రాహుల్, సోనియా, మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. నెల క్రితమే తమ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయ్యాయని… కోర్టులు, ఎన్నికల కమిషన్ ఉండి ఏం లాభం అంటూ మండిపడ్డారు. దీనివల్ల డబ్బులు లేక కనీసం పోస్టర్లు కూడా వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని ముగ్గురు అగ్రనేతలు ఆవేదన చెందారు.
ఎన్నికల వేళ దెబ్బ…
ఎన్నికల సమయంలో తమను దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో ఇలా బ్యాంక్ అకౌంట్స్ ను మోదీ సర్కారు ఫ్రీజ్ చేసిందని రాహుల్ ఆరోపించారు. AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియాగాంధీతో కలిసి ఢిల్లీలో సమావేశం నిర్వహించిన రాహుల్.. ఫ్రీజింగ్ వివరాల్ని బయటపెట్టారు.
ప్రజాస్వామ్యం ఫ్రీజ్…
కేంద్రం ఫ్రీజ్ చేసింది తమ బ్యాంక్ అకౌంట్లు కాదని, భారత ప్రజాస్వామ్యాన్ని అని రాహుల్ అన్నారు. ‘ఈ ఫ్రీజింగ్ వల్ల మేం ఏం చేయలేకపోతున్నాం.. ఇది నేరపూరిత చర్య.. ప్రస్తుత కాలంలో బ్యాంక్ అకౌంట్లు నిలిచిపోతే అన్ని పనులూ ఆగిపోతాయి.. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు ఇలా చేయడం దారుణం.. దీనివల్ల భారత ప్రజాస్వామ్యమే(Democracy) అబద్ధంగా మారింది.. దేశంలో ఇంత దారుణం జరుగుతుంటే అంతా చోద్యం చూస్తున్నారు.. దేశంలో ఇన్ని వ్యవస్థలు ఉండి ఏం లాభం..’ అని రాహుల్ అన్నారు.