
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. BRSకు చెందిన మాగంటి సునీతపై పూర్తి ఆధిక్యం సంపాదించారు. ఇక BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్
గల్లంతయింది. గులాబీ పార్టీ సిట్టింగ్ సీటయిన జూబ్లీహిల్స్ చేజారింది. రౌడీయిజంతో ప్రజలను బెదిరించి గెలిచారని, దీన్ని గెలుపు అనుకోవడం లేదని సునీత అన్నారు. బస్తీల్లో ప్రతి ఒక్కర్నీ బెదిరించి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘంపైనా ఆమె విమర్శలు చేశారు.