ఖమ్మం వరద బాధితుల్ని పరామర్శించేందుకు BRS నేతలు వెళ్లడంతో.. రెండు పార్టీల మధ్య ఘర్షణ ఏర్పడింది. మాజీ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్.. నగరంలోని బొక్కలగడ్డలో బాధితుల్ని పరామర్శిస్తున్న సమయంలో అధికార పార్టీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.
హరీశ్ రావు, అజయ్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. తర్వాత ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు చేస్తూ పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో గందరగోళం ఏర్పడింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టి నాయకుల్ని అక్కణ్నుంచి పంపించివేశారు.