
ఎన్నికల్లో అలయెన్స్ కు సంబంధించి తమతో మీట్ కావాలని కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ను CPM పెండింగ్ లో పెట్టింది. BRS ఇచ్చిన ఝలక్ తో ఇక నుంచి ఆచితూచి అడుగులు వేయాలని చూస్తోంది. హస్తం పార్టీ ఇచ్చే క్లారిటీని బట్టి భేటీకి అటెండ్ కావాలని, తొందరపాటు పనికిరాదన్న ఆలోచనలో ఉంది. తమతో మాట్లాడాలంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఆహ్వానానికి సుముఖత చూపని CPM.. మర్యాదపూర్వక భేటీకి బదులు సీట్ల కేటాయింపులపై చర్చించాలని స్పష్టం చేసింది. ఆ క్లారిటీని బట్టే ఇరు పార్టీలు మీటింగ్ పెట్టుకోవాలని, కమ్యూనిస్టులు కోరిన సీట్లలో ఒకట్రెండు మినహా మిగిలినవి ఇవ్వడానికి ముందుకు వస్తే అలయెన్స్ కు అంగీకారిస్తామన్న రీతిలో ఆ పార్టీ లీడర్లు ఉన్నారు.
నిన్న CPI లీడర్లతో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇంటర్నల్ గా చర్చలు నిర్వహించారు. దీనిపై ఈ రోజు మరోసారి కలుద్దామంటూ చేసిన ప్రతిపాదనపై కమ్యూనిస్టులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పొత్తుల పేరుతో కాలయాపన తప్ప వేరే ఏం లేదని, పూర్తి క్లారిటీ రాకముందు మీటింగ్ పెడితే మళ్లీ మోసపోవడమేనన్న ఆలోచన కామ్రేడ్లలో కనిపిస్తున్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇస్తేనే చర్చలు జరుపుతామన్న భావన CPMలో కనిపిస్తున్నట్లు ఆ పార్టీ లీడర్లు అంటున్నారు.