
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చేవెళ్ల కేవీఆర్ గ్రౌండ్ లో జరిగిన సభకు AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అటెండ్ అయ్యారు. ఈ సభ ద్వారా SC, ST డిక్లరేషన్ ను PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. వివిధ అంశాలతో కూడిన డిక్లరేషన్ విడుదల అయింది. అంబేడ్కర్ అభయ హస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు అందజేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కింద రూ.6 లక్షలు చెల్లిస్తామని ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన చేపట్టే రిజర్వేషన్లలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం వాటా ఉంటుందని డిక్లరేషన్ ద్వారా తెలియజేశారు. మరోవైపు ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు.. ఫ్రీగా ఇళ్లు కట్టుకునేందుకు స్థలాలు.. అసైన్డ్ ల్యాండ్స్ పై యాజమాన్య హక్కులు కల్పిస్తామని అందులో స్పష్టం చేశారు.
డిక్లరేషన్ లోని మరిన్ని అంశాలు
SC, STల్లో టెన్త్ పాసయితే రూ.10,000
పోడు భూములకు పట్టాలు
కొత్తగా ఐదు ITDAల ఏర్పాటు
గ్రామపంచాయతీ గల తండాకు ప్రతి సంవత్సరం రూ.20 లక్షలు
ఎస్సీ కార్పొరేషన్లకు ఏటా రూ.750 కోట్లు
ఎస్టీ కార్పొరేషన్లకు రూ.500 కోట్లు
9 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్
ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు రూ.15 వేలు
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి రూ.25 వేలు
PG కంప్లీట్ చేసిన వారికి రూ.లక్ష
PhD, MPhil పూర్తయిన వారికి రూ.5 లక్షలు
ప్రతి మండలంలో గురుకుల స్కూల్
డిగ్రీ, పీజీ స్టూడెంట్స్ కు ఉచిత వసతి
విదేశీ వర్సిటీల్లో చదివేవారికి ఆర్థిక సాయం