
వరద బాధితులకు రూ.10 వేలు పరిహారమివ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా గందరగోళానికి దారితీసింది. గన్ పార్కు నుంచి GHMC ఆఫీస్ వరకు ర్యాలీ తీసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.. అక్కడకు చేరుకున్నాక కార్పొరేషన్ ఆఫీసులో బైఠాయించారు. వినతి పత్రం తీసుకోవడానికి GHMC కమిషనర్ నిరాకరించడంతో కాంగ్రెస్ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. కమిషనర్ తీరును తప్పు పడుతూ ఆయన పేషీ ముందు కూర్చుని నినాదాలు చేశారు. అంతకుముందు కొంతమంది కార్యకర్తలు ఆఫీసు గేటు దూకి లోపలికి చొచ్చుకెళ్లారు. అప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. గేటు దూకిన వారందర్నీ అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ కు వరదలు వచ్చినపుడు ప్రకటించిన రీతిలో రూ.10 వేలను ఇప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా బాధితులకు చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ KCR సర్కారుపై పలువురు లీడర్లు విమర్శలు చేశారు.