హస్తం(Congress) పార్టీ కామారెడ్డిలో చేపట్టబోయే సభ వాయిదా పడింది. ఈనెల 15న జరగాల్సిన BC డికర్లేషన్ సభ కోసం కొద్దిరోజులుగా పార్టీ నేతలు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత BRS ప్రభుత్వం తెచ్చిన 50% సీలింగ్ ను ఎత్తివేసిన కాంగ్రెస్ సర్కారు.. వచ్చే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలుచేయాలన్న భావనతో ఉంది. కానీ వర్షాలు పడే అవకాశాలున్నందున సభను వాయిదా వేస్తున్నట్లు, మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని PCC తెలిపింది.