వలసలే తమకు బలంగా మారతాయని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. మెయిన్ లీడర్లతో మీటింగ్ ఏర్పాటు చేసింది. కోమటిరెడ్డి నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, CLP లీడర్ మల్లు భట్టి విక్రమార్కతోపాటు పలువురు సీనియర్లు అటెండ్ అయ్యారు. వచ్చే ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తోపాటు ఇతర పార్టీల నుంచి చేరికలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే యువతకు, రైతులకు స్పెషల్ గా డిక్లరేషన్లు ప్రకటించగా.. ఈ మీటింగ్ ద్వారా బీసీలు, మహిళలతోపాటు వివిధ వర్గాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించాలని చూస్తున్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తున్నారని, వారిని ఏ విధంగా పార్టీలోకి ఇన్వైట్ చేయాలన్న తీరుగానూ భేటీలో చర్చ నడుస్తోంది. గద్వాల, హైదరాబాద్, నిజామాబాద్ ఇలా పలు జిల్లాల నుంచి వలసలు ఉంటాయని, వాటిని ఏ విధంగా క్యాచ్ చేయాలనే అంశంపైనా మంతనాలు సాగుతున్నాయి.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక కోసం కొల్లాపూర్ లో సభ ఏర్పాటు చేసినా ప్రియాంక గాంధీ షెడ్యూల్ దొరక్కపోవడంతో దాన్ని వాయిదా వేశారు. అయితే మళ్లీ ఎప్పుడు నిర్వహించాలి, జన సమీకరణ ఎలా చేయాలన్న దానిపైనా లీడర్లు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.