హస్తం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీపై తీవ్ర ఆరోపణలు చేసిన భారతీయ జనతా పార్టీ(BJP) సీనియర్ నేతకు తాఖీదులు(Notices) అందాయి. నిరాధార ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు చూపించాల్సి ఉందని, లేదంటే పరువు నష్టం దావా వేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వార్నింగ్ ఇచ్చింది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల(Candidates) ఎంపిక(Finalise)పై కమలం పార్టీ నేత NVSS ప్రభాకర్.. దీపాదాస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టికెట్లు కేటాయించేందుకు పెద్దయెత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయని మీడియా ఎదుట ప్రభాకర్ ఆరోపించారు.
రెండు రోజుల్లోనే…
రాష్ట్రంలోని కొందరు నాయకుల నుంచి పార్టీ ఇంఛార్జ్ నుంచి దీపాదాస్ మున్షీ.. బెంజ్ కార్లను తీసుకుని లబ్ధి పొందారన్నది ప్రభాకర్ ఆరోపణ. బెంజ్(Benz) కార్లు తీసుకుని టికెట్లు కేటాయించడం కాంగ్రెస్ పార్టీ తీరుకు నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు. ఈ ఆరోపణల్ని సీరియస్ గా తీసుకున్న హస్తం పార్టీ నాయకత్వం.. పరువు నష్టం దావా వేయాలని భావించింది. చేసిన ఆరోపణలపై రెండు రోజుల్లోగా ఆధారాలు(Evidence) చూపించాలని నోటీసులు పంపించారు. ఇచ్చిన గడువు(Deadline)లోగా సమాధానం ఇవ్వలేకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని నోటీసుల్లో హెచ్చరించారు.