RSS చీఫ్ అభిప్రాయాల్ని… మోదీపై లక్ష్యంగా చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇంటికి తిరిగిరావడం ఎంత గొప్ప అనుభూతి అంటూ జైరామ్ రమేశ్ సెటైర్లు వేశారు. అసలేం జరిగిందంటే… ’75 ఏళ్లు నిండితే ఇతరులకు దారివ్వాలి.. RSS సిద్ధాంతకర్త, దివంగత మోరోపంత్ పింగిల్ అదే చెప్పారు.. మర్యాదగా పక్కకు తప్పుకోవడానికి 75 ఏళ్లు సంకేతం.. శాలువాతో సత్కరిస్తే అక్కడే ఆగాలి..’ అని భగవత్ అన్నారు. BJP సీనియర్లు అద్వాని, మురళీ మనోహర్ జోషి, జశ్వంత్ సింగ్ లా మోదీ తప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. బ్యాగులు సర్దుకుని ఆఫీసుల నుంచి మోదీ, భగవత్ బయల్దేరే టైం అయిందంటూ సెటైర్లు వేశారు. భగవత్ కు 2025 సెప్టెంబరు 11న, మోదీకి సెప్టెంబరు 17న 75 ఏళ్లు పూర్తవుతాయి.