రాష్ట్రంలో ఎక్కడా వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంటు సరఫరా జరగడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ నిరసన బాట పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు జిల్లాల్లో ధర్నాలకు దిగారు. పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ట్రాన్స్ కో ఆఫీసుల ఎదుట నిరసనలు నిర్వహించారు. హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. కావాలనే రేవంత్ రెడ్డి మాటల్ని వక్రీకరించి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ లీడర్లు మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో క్రమంగా ప్రజాదరణ పెరుగుతోందంటున్న సీనియర్లంతా… BRS వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. అధికార పార్టీయే నిరసనలకు దిగడం విడ్డూరంగా ఉందని, దీన్ని బట్టే హస్తం పార్టీ బలమేంటో తెలుస్తోందన్నారు.