రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగబోయే అభ్యర్థుల(Candidates) లిస్టుపై కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయిలో స్క్రూటినీ చేస్తున్నది. ఈరోజు సమావేశమైన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ… ఆశావహుల వడపోతపై సుదీర్ఘంగా చర్చించింది. వెయ్యికి పైగా వచ్చిన దరఖాస్తుల్లో స్క్రూటినీ నిర్వహించి PEC… ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సిన స్క్రీనింగ్ కమిటీకి పేర్లను సిఫారసు చేసింది. మొత్తం 119 నియోజకవర్గాల(Constituencies)కు గాను 300 మంది పేర్లను పరిశీలించింది. ఇందులో ఒక్కో సెగ్మెంట్ లో ఇద్దరు, మరికొన్ని సెగ్మెంట్లలో ముగ్గురు, నలుగురు చొప్పున ఆశావహుల(Aspirants)ను PEC కమిటీలోని లీడర్లు పరిశీలించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ తో కూడిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ.. 300 పేర్లను స్క్రీనింగ్ కమిటీకి సిఫారసు చేసింది.