CM పదవి సొంత జాగీరు కాదన్నట్లు ప్రకటించారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం… హస్తం పార్టీ విధానాలకు విరుద్ధమని నల్గొండ జిల్లా మునుగోడు MLA ట్వీట్ చేశారు. ఇంకా ఇలా… ‘జాతీయ పార్టీ కాంగ్రెస్ లో అధిష్ఠానం(High Command) ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది.. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాల్ని నికార్సయిన పార్టీ నాయకులు, కార్యకర్తలు సహించరు..’ అని ‘X’లో ట్వీట్ చేశారు.