
రాహుల్ గాంధీ(Rahul)కి సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత ఎదురైంది. ట్రంప్ మాటల్ని ఆయన సమర్థిస్తే… దాన్ని తప్పుబట్టారు కార్తి చిదంబరం, రాజీవ్ శుక్లా, శశిథరూర్. భారత్ ది చనిపోయిన ఆర్థిక వ్యవస్థ అని ట్రంప్ అన్నారు. ‘ఆయన చెప్పింది నిజమే.. ఈ విషయం ప్రధాని, ఆర్థిక మంత్రికి తప్ప అందరికీ తెలుసు.. ఒక వాస్తవం చెప్పినందుకు సంతోషంగా ఉన్నా..’ అంటూ రాహుల్ మాట్లాడారు. ట్రంప్ చెప్పింది తప్పు.. మా ఆర్థిక పరిస్థితి బలహీనంగా లేదు.. ఎవరైనా మమ్మల్ని ఆర్థికంగా అంతం చేయగలమనుకుంటే అసాధ్యం.. ట్రంప్ భ్రమలో జీవిస్తున్నారు..’ అని కార్తి చిదంబరం, శుక్లా ఎదురుదాడి చేశారు. ఇక థరూర్ సైతం.. ‘US ప్రెసిడెంట్ చెప్పింది శుద్ధ అబద్ధం.. అలా కానే కాదు..’ అంటూ కొట్టిపడేయడంతో తమ అగ్రనేత తీరును విమర్శించినట్లయింది.