లెఫ్ట్ పార్టీల(Left Parties)తో కలిసి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ముందుకు సాగాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. CPMతో సమావేశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీకి CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు కీలక నేతలంతా హాజరయ్యారు. BJPతోపాటు ఇతర శక్తులను ఓడించేందుకు హస్తం పార్టీ చాపిన చేయిని అందుకుంటామని ఆ పార్టీ ప్రకటించింది.
CM ఏమన్నారంటే…
మద్దతు(Support) ఇచ్చేందుకు CPM నేతలు అంగీకరించారని CM రేవంత్ రెడ్డి తెలిపారు. కమలం పార్టీ విధానాలను వ్యతిరేకించి వారిని ఓడించేలా మా కూటమి లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతుందన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పనిచేసేందుకు కమ్యూనిస్ట్ పార్టీ అంగీకరించిందన్నారు.
లెఫ్టిస్టుల వాదన ఇది…
ముఖ్యమంత్రితో చర్చల్లో భాగంగా కొన్ని ప్రతిపాదన(Proposals)ల్ని కాంగ్రెస్ పార్టీ ఎదుట CPM ఉంచింది. భువనగిరి పార్లమెంటుతోపాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరామని, తమ ప్రతిపాదనలకు కాంగ్రెస్ అధిష్ఠానం(High Command) సై అంటుందన్న ఉద్దేశంతో ఉన్నామని తమ్మినేని వీరభద్రం అన్నారు. అటు CPM లేవనెత్తిన అంశాల్ని తమ హైకమాండ్ తో ప్రస్తావించి రేపటిలోగా ఒక అభిప్రాయానికి వస్తామన్న రేవంత్.. ఆ పార్టీ సహకారంతో భవిష్యత్తులోనూ ముందుకెళ్తామన్నారు.