మునుగోడు ఎన్నికల్లో BRSతో జట్టుకట్టిన సీపీఐ, సీపీఎం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దూరం కాబోతున్నాయి. BRSతో పొత్తు లేదని తేలడంతో భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై CPI, CPM మీటింగ్ పెట్టుకున్నాయి. BJPతో చేతులు కలపడం వల్లే BRS ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అనుమానం ఉందన్నారు. మునుగోడు ఎన్నికల్లో వాడుకుని వదిలేయడం మీద CMపై విమర్శలు చేశారు. మిత్రధర్మం, స్నేహధర్మం ఉండవా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అసహనం చెందారు. ‘ఇదే లెఫ్ట్ లేకపోతే మునుగోడులో మీ పరిస్థితి ఏమయ్యేది.. మేం లేకపోతే ఆనాడు BJP ఓడిపోయేదా.. BJP గెలిస్తే తెలంగాణ ఇలా ఉండేదా.. లెఫ్ట్ తో పొత్తంటే ఏదో కామెంట్ చేశారు.. ఇది CM విజ్ఞతకే వదిలేస్తామని’ అన్నారు.
‘మరచిపోతే మాకేం బాధ లేదు అది మీ ఖర్మా.. వామపక్షాలుగా రానున్న ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామన్నారు. కమ్యూనిస్టులతో కలిసే ముందుకు పోతామని గతంలోనే చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మాట తప్పి ఏకపక్షంగా సీట్లు ప్రకటించడం ఆయన తీరుకు నిదర్శనమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.