BRSతో ఎలాగూ పొత్తు లేదని తేలిపోవడంతో ఇక వామపక్షాలతో జట్టు కట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. తమతో చర్చలు జరపాలని పంపిన మెసేజ్ తో ఆ పార్టీల రాష్ట్ర లీడర్లు.. హస్తం పెద్దలతో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో.. CPI నేతలు సీక్రెట్ మీటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఈ సీక్రెట్ మీటింగ్ జరిగినట్లు పార్టీ లీడర్లు సూచనప్రాయంగా తెలిపారు. కమ్యూనిస్టుల గౌరవానికి భంగం కలగనంత వరకు కలిసి వెళ్లడానికి సిద్ధమే అన్న సంకేతాల్ని ఇచ్చారు. కొన్ని ప్రపోజల్స్ ను కాంగ్రెస్ పార్టీ ఎదుట ఉంచామని, ఆ ప్రతిపాదనలకు అంగీకరిస్తే అలయెన్స్ కు అభ్యంతరం లేదని హింట్ ఇస్తున్నారు.
CPMతో కలిసే నిర్ణయం
అయితే వచ్చే ఎలక్షన్ల కోసం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎలాంటి పొత్తులు పెట్టుకోవాలన్నా CPMతో కలిసే ఉమ్మడిగా డిసిషన్ తీసుకుంటామని CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎవరితో అలయెన్స్ ఉన్నా లేకున్నా CPM, CPI మాత్రం జాయింట్ గానే ఎలక్షన్లకు వెళ్తాయని అంటున్నారు.
కొత్తగూడెం సీటుపై ఇంకా చర్చించలేదని, అన్నీ కుదిరితేనే కాంగ్రెస్ తో పొత్తుకు ఆలోచిస్తామని చెబుతున్నారు.