రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో మాట్లాడిన ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. పలు అంశాలను వివరించారు. అయితే ఒక అంశంలో మాత్రం NDAతోపాటు UPAపైనా విమర్శలు చేశారు. తమ పాలనకు చెందిన UPA పనితీరుపై ఇలా విమర్శలు చేయడంతో లోక్ సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. యువతకు ఉద్యోగాల(Employment) కల్పనపై మాట్లాడే సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘మన దేశం వృద్ధి చెందుతోంది.. అయితే ఆ వృద్ధిలో ప్రస్తుతం స్పీడ్ తగ్గింది.. ఉద్యోగాలు కల్పించే విషయంలో గత UPA, ప్రస్తుత NDA ప్రభుత్వాలు యువత(Youth)కు సమాధానం చెప్పలేకపోయాయన్నారు. మోదీ సర్కారు తెచ్చిన మేకిన్ ఇండియా మంచిదే అయినా ఆ విషయంలో NDA విఫలమైందన్నారు. మేకిన్ ఇండియాతో ఒరిగేదేం లేదని, GDPలో తయారీ రంగం వాటా తగ్గిపోయిందని రాహుల్ విమర్శించారు. ఇలా సొంత పాలనపై ప్రధాన ప్రతిపక్ష నేత పార్లమెంటు సాక్షిగా విమర్శించడం ఆశ్చర్యకర సంఘటనగా నిలిచింది.