తొలిరోజు ఒకే దేశం-ఒకే ఎన్నిక, మణిపూర్, రిజర్వేషన్లు, నిరుద్యోగం వంటి వంటి అంశాలపై చర్చించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC.. ఈ రోజు ఎన్నికల నిర్వహణపై సమావేశం అయింది. హోటల్ తాజ్ కృష్ణాలో జరుగుతున్న భేటీలో.. వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికలకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై విస్తృత స్థాయిలో చర్చ జరగనుంది. జమిలి ఎన్నికలకు వెళ్తారా లేదా సాధారణ ఎన్నికలు ఉంటాయా అన్న కోణంలోనూ చర్చ సాగనుంది. మరోవైపు 5 రాష్ట్రాల ఎలక్షన్లలో విజయం సాధిస్తే ఒక రకంగా BJPకి అడ్డుకట్ట వేయొచ్చనే భావన కనపడుతున్నది. నిన్న నాలుగు గంటలు పైగా జరిగిన భేటీలో పలు తీర్మానాలను CWC ఆమోదించింది.
నేడే విజయభేరి సభ
సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈరోజు సాయంత్రం హస్తం పార్టీ అగ్రనేతలు.. హైదరాబాద్ శివారులో నిర్వహించే బహిరంగసభకు అటెండ్ అవుతారు. తుక్కుగూడలో జరగనున్న సభలో సోనియా, రాహుల్, ఖర్గే, ప్రియాంకతోపాటు సీనియర్ లీడర్లంతా పాల్గొంటారు. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంగా సభ సాగనుంది.