పార్టీ గీత దాటితే వేటు తప్పదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ వార్నింగ్ ఇచ్చారు. CLP(కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ) సమావేశంలో మాట్లాడిన ఆమె.. MLAల తీరు మార్చుకోవాలన్నారు. సమస్యలు ఉంటే అంతర్గతం(Internal)గా చర్చించుకోవాలని, పార్టీపై బహిరంగంగా విమర్శలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. CM రేవంత్ అధ్యక్షతన ఐదున్నర గంటలపాటు సాగిన భేటీలో.. వివిధ అంశాలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం కనపడుతుందన్నారు.
MLAల్ని మంత్రులు సమన్వయం చేసుకోవాలని, స్థానిక సంస్థ ఎన్నికల్లో మెజార్టీ గ్రామాలు గెలవడానికి శాసనసభ్యులే బాధ్యత తీసుకోవాలన్నారు. కులగణన, SC వర్గీకరణ వంటి అంశాలు ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో ఉన్నా, అనుకున్న స్థాయిలో ప్రచారం లేదన్నారు. సమస్యలపై నాలుగు గోడల మధ్యే మాట్లాడుకోవాలన్న దీపాదాస్.. MLAలు రహస్య సమావేశాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని సీరియస్ అయ్యారు.