మహారాష్ట్రలో మహాయుతి సర్కారు కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ తోపాటు NDA పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రులుగా తొలుత ఏక్నాథ్ షిండే, ఆ తర్వాత అజిత్ పవార్ ప్రమాణం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి CM బాధ్యతలు చేపట్టిన కార్యక్రమానికి వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, వెటరన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ ప్రముఖులు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ హాజరయ్యారు.