హిందీ వద్దు కానీ, తమిళ్ సినిమాలు హిందీలోకి డబ్ చేయాలి, డబ్బులు రావాలి అన్న పవన్ కల్యాణ్ విమర్శలపై DMK స్పందించింది. 1938 నుంచి హిందీని వ్యతిరేకిస్తున్నామని, పవన్ పుట్టని కాలంలో 1968లోనే బిల్లు పాస్ చేశామంటూ DMK నేతలు సయ్యద్ హఫీజుల్లా, ఇళంగోవన్ అన్నారు. ‘హిందీ, ఇతర భాషలను తమిళనాడు ఎప్పుడూ వ్యతిరేకించలేదు.. ఇప్పటికే హిందీ ప్రచార సభలున్నాయి.. ఆసక్తి ఉన్నవారికి స్వచ్ఛందంగా ఆ భాషను నేర్పుతున్నాం.. మా రాష్ట్ర ప్రజలపై ఏ భాషనూ రుద్దడాన్ని ఒప్పుకోం.. BJP సర్కారు నుంచి ఏదో ఒక ప్రయోజనం పొందాలన్నది పవన్ ఉద్దేశం..’ అని విమర్శించారు.