సర్పంచి నుంచి పార్లమెంటు సభ్యుడు దాకా అందరూ బీజేపీ తరఫున గెలవాలని… రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రతి పార్టీ కార్యకర్త, నాయకుడు కోరుకుంటున్నారని సీనియర్ నేత ఈటల రాజేందర్ అన్నారు. అనేక కష్టాలకు ఓర్చుకుని, అవమానాలు భరించి, పదవులు లేకపోయినా కమలం పార్టీ జెండాలు పట్టుకున్నారంటూ వారి త్యాగాలను ట్విటర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. ఇక ప్రజల ఆశీర్వాదం దొరికే సమయం వచ్చేసిందని, బీజేపీని గెలిపించేందుకు జనమంతా సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీని గెలిపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో శతథా కృషి చేస్తానని భరోసానిచ్చారు. ఒక సైనికుడిలా నిలిచి మీకు అండగా ఉంటానంటూ పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని నూరిపోశారు.
గత కొద్దికాలంగా బీజేపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. ఈ దశలో ఈటల కూడా అసంతృప్తిగా ఉన్నారంటూ విపరీతమైన ప్రచారం జరుగుతోంది. వాటిని ఎప్పటికప్పుడూ ఖండిస్తూ వచ్చిన రాజేందర్… కార్యకర్తలు, నాయకులకు అనునిత్యం అండగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు.