శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే సంస్కృతి తనకు లేదని BJP నేత ఈటల రాజేందర్ అన్నారు. ‘ సైకోనా, శాడిస్టా, మనిషా, పశువా.. ఏ పార్టీలో ఉన్నడు.. ఎవరి అండతో ధైర్యం చేస్తున్నడు.. బీ కేర్ ఫుల్, బీ కేర్ ఫుల్.. ఎవరెవరు సోషల్ మీడియాలో పెడుతున్నరో, ఏమేం రెచ్చగొడుతున్నరో ఏమేం చేస్తున్నరో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా.. నేననుకుంటున్నా సంస్కారం, సభ్యత ఉందని.. ఇట్లాంటివి అరికడ్తరని.. అరికట్టకపోతే నష్టపోయేదేవరో అర్థం చేసుకోండి.. నష్టం మాక్కాదు, మాకేం తక్కువుంది.. అసలు మీరెవరసలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాల్లేవ్..’ అంటూ సదరు నేతపై ఫైర్ అయ్యారు. గత కొద్దిరోజులుగా పార్టీలో ఏర్పడ్డ అంతర్గత పోరు బయటకు వచ్చిందన్న ప్రచారం నడుమ ఈటల ఇలా మాట్లాడారు.