రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు శతథా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని డిసైడ్ అయింది. ఈ సభకు సోనియా గాంధీని రప్పించి ఆమె నోటి ద్వారా హామీలను ప్రకటిస్తే బాగుంటుందన్న ఉద్దేశంలో రాష్ట్ర నేతలు ఉన్నారు. ఈ నెల 17న ఈ బహిరంగసభ ఉండనుండగా.. పరేడ్ గ్రౌండ్ కోసం అప్లయ్ చేసుకున్నట్లు PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ‘సెప్టెంబరు 17న 5 గ్యారెంటీలను ప్రకటించాలని సోనియాకు విజ్ఞప్తి చేశాం.. ఏకంగా CWC సమావేశాల్నే హైదరాబాద్ లో నిర్వహిస్తున్నందుకు హైకమాండ్ కు కృతజ్ఞతలు.. బుధవారం సాయంత్రం కె.సి.వేణుగోపాల్ వచ్చి ఏర్పాట్లపై రివ్యూ చేస్తారు.. పరేడ్ గ్రౌండ్ కు పర్మిషన్ ఇవ్వకుండా BRS, BJP కుట్ర పన్నుతున్నాయి.. సభ కోసం ఈ నెల 2నే డిఫెన్స్ అధికారులకు లెటర్ ఇచ్చాం.. కానీ పరేడ్ గ్రౌండ్ లో తామే సభ పెడుతున్నామంటూ కిషన్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనం.. పరేడ్ గ్రౌండ్ కాకుంటే ఎల్.బి.స్టేడియం అదీ లేకుంటే ఔటర్ పరిధిలో ఎక్కడైనా సభ పెట్టుకుంటాం… ఇందులో మరో మాటకు తావు లేదు’ అంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
జోడో యాత్రకు సెప్టెంబరు 7తో ఏడాది కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఆ రోజున జిల్లా, మండల కేంద్రాల్లో పాదయాత్రలతో ఉత్సవాలు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు.