ఎలక్షన్ కమిటీలు, అభ్యర్థుల ప్రకటనల్లో గతంలో ఆలస్యంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం మాత్రం ముందస్తుగానే కమిటీని ప్రకటించింది. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నా.. తెలంగాణ అసెంబ్లీ కోసం 26 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. PCC చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కమిటీ.. ఎన్నికల వ్యవహారాల్ని పరిశీలిస్తుందని AICC తెలిపింది. రేవంత్ తోపాటు CLP నేత మల్లు భట్టి విక్రమార్క, MPలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, MLC జీవన్ రెడ్డి, MLAలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, వీరయ్య, సీతక్కకు స్థానం కల్పిస్తూ AICC జనరల్ సెక్రటరీ కె.సి.వేణుగోపాల్ ఆదేశాలిచ్చారు.
ఇక ఈ కమిటీలో సీనియర్లు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, వి.హన్మంతరావు, అంజన్ కుమార్ యాదవ్, అజహరుద్దీన్ తోపాటు ఈ మధ్యే పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎన్నికల పరిశీలన కమిటీలో స్థానం కల్పించారు. ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్.. NSUI స్టేట్ చీఫ్.. స్టేట్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా నియమితులయ్యారు.