రానున్న శాసనసభ ఎన్నికల(Assembly Elections) కోసం కమలం పార్టీ కసరత్తును వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 43 సభలు నిర్వహించాలని, ఒక్కో సభ వారీగా ఢిల్లీ పెద్దల్ని పిలవాలని నిర్ణయించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఔషాపూర్ లోని VBIT కాలేజీలో BJP రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అటెండ్ అయ్యారు. జీ 20, చంద్రయాన్-3, పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ, మహిళా రిజర్వేషన్ బిల్లుల ప్రకటనపై ఈ సమావేశంలో ధన్యవాద తీర్మానాలను ఆమోదించారు. 20 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 60 రోజుల ప్లాన్ తయారు చేశారు.
కేంద్ర పథకాలు ప్రజల్లోకి
కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నేతలకు నడ్డా సూచించారు. ఇళ్ల నిర్మాణాలు, ఉచిత రేషన్, తగ్గిన పేదరికం వంటి అంశాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు.