మే 13న జరిగే పోలింగ్ కోసం సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేయనుంది ఎలక్షన్ కమిషన్(Election Commission). ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తుండగా.. ఈ నెల 25 చివరి తేదీ. లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 7 దశల్లో పోలింగ్ జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఏప్రిల్ 19న.. APలో మే 13న.. ఒడిశా అసెంబ్లీకి మే 13, 20న పోలింగ్ జరుగుతుంది.
తొలి విడత(First Phase) జరిగే నియోజకవర్గాల్లో ప్రచారం(Campaign) గడువు ముగిసింది. ఎల్లుండి(ఈ నెల 19న) దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగే పోలింగ్ కోసం EC గట్టి ఏర్పాట్లు చేసింది. తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు శుక్రవారం ఓటింగ్ జరుగుతుంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలతోపాటు.. BRS MLA లాస్య నందిత మృతితో ఖాళీ అయిన కంటోన్మెంట్ స్థానానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రేపటితో కలిపే ఉండనుంది.
తెలంగాణ షెడ్యూల్ ఇలా…
నోటిఫికేషన్…: ఏప్రిల్ 18
నామినేషన్లకు తుది గడువు…: ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన…: ఏప్రిల్ 26
ఉపసంహరణ గడువు…: ఏప్రిల్ 29
పోలింగ్…: మే 13
కౌంటింగ్…: జూన్ 4
లోక్ సభకు విడతల వారీగా ఇలా…
తొలి విడత…: ఏప్రిల్ 19 (102 నియోజకవర్గాలు)
రెండో విడత…: ఏప్రిల్ 26 (89 నియోజకవర్గాలు)
మూడో విడత…: మే 7 (94 నియోజకవర్గాలు)
నాలుగో విడత…: మే 13 (96 నియోజకవర్గాలు)
ఐదో విడత…: మే 20 (49 నియోజకవర్గాలు)
ఆరో విడత…: మే 25 (57 నియోజకవర్గాలు)
ఏడో విడత…: జూన్ 1 (57 నియోజకవర్గాలు)