సీట్ల పొత్తు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా తమతో చర్చించలేదని, మరోవైపు వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కమ్యూనిస్టులతో BRSకు చెడిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ తో జోడీ కడతారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. CPM, CPI కలిసే ఉంటాయని, ఉమ్మడిగా పోటీ చేస్తాయని ఆ రెండు పార్టీల లీడర్లు తెలిపారు.
మునుగోడులో BJP గెలిస్తే గందరగోళ పరిస్థితులు ఏర్పడేవని, దాన్ని నివారించడానికే BRSతో పొత్తు పెట్టుకున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గుర్తు చేశారు. మునుగోడు ఎన్నికల్లో కలిసి రావాలని స్వయంగా ముఖ్యమంత్రే కోరారని… తమపై అసత్య ప్రచారం కోసం కొద్దిమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. అధికార పార్టీతో పొత్తులు కలిసిరాకపోతే బలం ఉన్న చోట ఈ రెండు పార్టీలే బరిలోకి దిగుతాయన్నారు.