పార్లమెంటు సమావేశాల(Sessions) కోసం నిమిషానికయ్యే ఖర్చు భారీగా ఉంటుంది. రూ.1.25 లక్షల చొప్పున లోక్ సభ, రాజ్యసభకు కలిపి రూ.2.5 లక్షలు ఖర్చవుతోంది. భోజనానికి గంట మినహాయించి ప్రతి సభ రోజుకు 6 గంటలు నడవాలి. ఈ వర్షాకాల సెషన్స్ లో 3 రోజులు పూర్తి కాగా.. ఒక్కో సభ 18 గంటలు పనిచేయాలి. కానీ వాయిదాల దెబ్బతో… రాజ్యసభ 4.4 గంటలు, లోక్ సభ కేవలం 54 నిమిషాలకే పరిమితమయ్యాయి. దీనివల్ల ఎగువసభకు రూ.10.2 కోట్లు, దిగువసభకు రూ.12.83 కోట్ల నష్టం వాటిల్లింది. https://justpostnews.com
కేవలం 3 రోజుల అంతరాయంతో పన్ను చెల్లింపుదారుల సొమ్ము రూ.23 కోట్లు వృథా అయింది. ఆ డబ్బు వృథా చేస్తున్నారంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాల్ని విమర్శిస్తూ అన్నారు. ఇప్పుడు చెప్పింది.. 2012లో అప్పటి మంత్రి పవన్ బన్సల్ లెక్కల ప్రకారమే సుమీ. తాజా లెక్కలు తీస్తే నిమిషం ఖర్చు మరింత పెరుగుతుండొచ్చు.